చంద్రబాబు టూర్ హైటెన్షన్‌.. రణరంగంగా మారిన పుంగనూరు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు (CHANDRABABU NAIDU) పుంగనూరు పర్యటన రణరంగంగా మారింది. టీడీపీ, వైపీపీ కార్యకర్తల పరస్పర రాళ్ల దాడులు, టీడీపీ కార్యకర్తలు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టడం, లాఠీఛార్జ్‌లతో చిత్తూరు (CHITTURU) జిల్లాలో అంగళ్లు కూడలి యుద్దభూమిని తలపిస్తోంది. పోలీసుల వాహనాలపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేయడంతో వాటికి నిప్పు పెట్టారు. అలాగే పోలీసులపై కూడా రాళ్లు రువ్వగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టారు. దీంతో చంద్రబాబు టూర్ హైటెన్షన్‌ను క్రియేట్ చేస్తోంది.

టీడీపీ కార్యకర్తలు రాళ్లు, బీర్ బాటిళ్లతో పోలీస్ వాహనాలు, పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో రెండు పోలీస్ వాహనాలు పూర్తిగా ధ్వంసమవ్వగా.. ఇద్దరు ఎస్సైలు, 10 మంది కానిస్టేబుల్స్‌కు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ఫైర్ చేశారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల పరస్పర దాడులతో ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పోలీసులు కూడా ఇరు వర్గాలను కంట్రోల్ చేయలేకపోవడంతో ఘర్షణ వాతావరణం మరింత పెరుగుతోంది.

ఉద్రిక్త పరిస్థితులపై చంద్రబాబు స్పందించారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏం జరుగుతుందో చూశారుగా అంటూ వ్యాఖ్యానించారు. మీరు కర్రలతో వస్తే మేము కర్రలతో వస్తామని, పిల్లిని కూడా రూమ్‌లో ఉంచి కొడితే పులి అవుతుందన్నారు. తాను మళ్లీ పుంగనూరు(PUNGANOORU)) వస్తానని, ఇవాళ విధ్వంసానికి పెద్దిరెడ్డి, పోలీసులే కారణమని ఆరోపించారు. పుంగపూరు ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాను పుంగనూరు రోడ్లపై తిరగకూడదా? అంటూ ప్రశ్నించారు. మొన్నే పులివెందులలో పొలికేక వినిపించానని, ఇప్పుడు పుంగనూరులో గర్జిస్తున్నట్లు తెలిపారు. ‘పుంగనూరు మీ జాగీరా..? పుంగనూరు పుడింగివా నువ్వు..? పుంగనూరు, అంగళ్లులో జరిగిన దాడులను గుర్తు పెట్టుకుంటా’ అని చంద్రబాబు చెప్పారు.

Latest Articles

తీవ్రంగా కొనసాగుతున్న ఇరాన్‌, అమెరికా యుద్ధం

అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. శాంతి ఒప్పందం జరిగినప్పటికీ.. రెండు దేశాలు రూల్స్ బ్రేక్ చేసి హింసకాండను కొనసాగిస్తున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్