ఏపీ సీఎం జగన్(jagan)కు టీడీపీ నేతలు సెల్ఫీ చాలెంజ్ లు విసురుతున్నారు. ఇప్పటికే యువగళం పాదయాత్రలో టీడీపీ హయాంలో చేసిన పనుల గురించి వివరిస్తూ లోకేశ్(lokesh) సెల్ఫీ చాలెంజ్ లు విసురుతుండగా.. తాజాగా ఆయన తండ్రి మాజీ సీఎం చంద్రబాబు(chandrababu) కూడా ఈ కోవలోకి వచ్చేశారు. నెల్లూరు జిల్లాలో పార్టీ నేతలతో సమీక్షలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు.. టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ దిగారు. ‘చూడు….జగన్! ఇవే మా ప్రభుత్వ హాయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు’ అంటూ ట్వీట్ చేశారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఎన్ని ఇళ్లు కట్టావో సెల్ఫీ దిగి చూపించగలవా అంటూ జగన్ కు చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు.
చూడు… @ysjagan! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు!
ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?#SelfieChallengeToJagan pic.twitter.com/1yoMGd4yf9
— N Chandrababu Naidu (@ncbn) April 7, 2023