జీఎఫ్ఎస్టీ సదస్సుకి ఛైర్మన్ హోదాలో హాజరైన చంద్రబాబు

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాదులో జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో ‘డీప్ టెక్నాలజీస్’ అనే అంశంపై జరిగిన సదస్సులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ జీఎఫ్ఎస్టీ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌ కు చంద్రబాబు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు, కార్పొరేట్ రంగ వ్యక్తులతో మూడేళ్ల క్రితం జీఎఫ్ఎస్టీ ఏర్పాటు చేశారు. పాలసీల రూపకల్పన, రీసెర్చ్, నాలెడ్జ్ షేరింగ్ అనే అంశాలపై జీఎఫ్ఎస్టీ కృషి చేస్తోంది. 2047 నాటికి 100 ఏళ్ల స్వాతంత్ర్య దేశంగా భారత దేశం… దీనిలో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ ఇండియా@100 అనే కాన్సెప్ట్‌పై జీఎఫ్ఎస్టీ పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది డీప్ టెక్నాలజీస్, లాజిస్టిక్స్, ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెక్టార్లపై సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు డీప్ టెక్నాలజీస్ అనే అంశంపై జరిగిన సదస్సులో చంద్రబాబు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. భారత దేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా మారడానికి తీసురావాల్సిన పాలసీలు, టెక్నాలజీ పాత్రపై నేటి సదస్సులో చర్చించనున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్