26.6 C
Hyderabad
Wednesday, July 16, 2025
spot_img

సుల్తానాబాద్‌ తెలంగాణ చౌరస్తాలో బీజేపీ శ్రేణుల సంబరాలు

ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని తెలంగాణ చౌరస్తాలో పటాసులు కాల్చి, సీట్లు పంపిణీ చేసి బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి హాజరయ్యారు.
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిన కొమురయ్యకి సంజీవరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయంతో ఉపాధ్యాయ లోకంలో బీజేపీపై ఉన్న అపారమైన విశ్వాసం, నమ్మకం మరింత బలపడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అధిక స్థానాలు గెలుస్తుందన్నారాయన.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్