ప్రజాస్వామ్యంలో తమ సమస్యలపై ప్రభుత్వాలు, పాలకులను ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇందుకోసం ప్రత్యేక అనుమతులు అవసరం లేదన్నారు. హైద్రాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ మహా సభలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ ఉద్యమకారురాలు మేథా పాట్కర్ లాంటి వారు మూసీ నది పరివాహక ప్రాంతంలో వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని.. ప్రజా స్వామ్య దేశంలో ప్రజలతో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని.. అడ్డుకోవడం సరైనది కాదని అన్నారు.
” ఉద్యమాల్లో నేను మేథా పాట్కర్ లాంటి వారి నుండి స్ఫూర్తి పొంది ప్రజా ఉద్యమాలు, రాజకీయాల్లోకి వచ్చి పని చేస్తున్నా. సర్వోదయ కర్యకర్తగా పని చేస్తుంటా. దేశంలో కోటీశ్వరుడు, సామాన్యుడు ఒకే టాక్స్ కడుతున్నారు. అంబానీ, అదానీ, పాల పాకెట్ కొనుకునే సామాన్యులు సమానంగా టాక్స్ లు కడుతున్నారు.. ఈ విధానాలు మారాలి. ఉత్పత్తి దారుల దేశంగా ఉండాలి కాని పెట్టు బడి దారుల దేశంగా ఉంది. ఇది మారాలి. అందుకోసం నేను కాంగ్రెస్ పార్టీ తరుపున కృషి చేస్తా.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు పరిమితమైన అధికారులను ఎన్నుకున్నారు. కానీ ప్రభుత్వాలు రాజులాగా వ్యవహరించకూడదు. నెహ్రూ గారు చెప్పినట్టు … ప్రజలు, ముఖ్యంగా బడుగు వర్గాల ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ ప్రజలను పక్కనపెటి పెట్టుబడిదారుల కోసం, మార్కెట్ వ్యవస్థ కోసం పని చేస్తున్నాయి. చాలా నిర్ణయాలు, ప్రజలకు, పర్యావరణానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. దీని మీద ప్రభుత్వాలు , రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గాంధీ గారి సూత్రం ప్రకారం రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అత్యోదయం కోసం పని చేయాలి.
కానీ ప్రస్తుతం దేశ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు.. సామాన్యులకు, వారి నిర్ణయాలకు చోటు లేకుండా పోయింది. దేశాన్ని కొందరు మార్కెట్‌ను శాసించే వ్యక్తుల నిర్ణయాల ప్రకారం దేశంలో విధానాలు చేస్తున్నారు ఇది మారాలి. ప్రపంచంలో ఎక్కడ పుట్టినా కూడా సమానత్వం ఉండాలి.. అందరూ కలిసి నిర్ణయించుకోవాలి. కానీ కొందరే ప్రభుత్వాన్ని, విధానాలను శాశిస్తున్నారు. ఈ వైఖరి మారాలి. ప్రపంచలో కూడా పెట్టుబడి, పెత్తందారి వ్యవస్థకు అనుగుణంగా పని చేస్తున్నాయి. ప్రజ ఉద్యమాలు చేసే వారు సామాన్య బడుగు బలహీన వర్గాల తరపున మాట్లాడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య రక్షణకు, ప్రజల తరుపున పని చేయాలి”.. అని మీనాక్షి నటరాజన్ అన్నారు.