హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి( Kukatpally) లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. మహిళ కానిస్టేబుల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మోసం చేశాడన్న ఆరోపణలతో కొల్లూరు ఎస్సై సురేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు, ఎస్సై సురేష్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తును బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి చేపట్టారు.
కేసు నమోదైన నేపథ్యంలో కూకట్‌పల్లి పోలీసులు ఎస్సై సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.
ఈ ఘటన పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.


