SSC Exams: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం..

SSC Exams: తెలంగాణలో ఏప్రిల్ మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షల ప్రారంభం కానున్నాయి. అయితే ఇవాల్టి నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జరగబోయే పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 2వేల652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఉదయం 9గంటల 30 నిమిషాల నుంచి మద్యాహ్నం 12గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది పరీక్షలు వంద శాతం సిలబస్ తో జరగనున్నాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ను ఇప్పటికే నిర్వహించారు. ఈసారి 6 పేపర్లతోనే పరీక్షలు జరుగుతుండగా… రాత పరీక్షలకు 80 మార్కులు, ఫార్మటివ్ అసెస్మెంట్ కు 20 మార్కులు కేటాయిస్తారు. అన్ని పరీక్షలకు 3 గంటల సమయం కేటాయించగా.. సైన్స్ పరీక్షకు మాత్రం 3గంటల20 నిమిషాల సమయం కేటాయిస్తారు.

ఏప్రిల్ 3వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష జరగనుండగా, ఏప్రిల్ 4వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 6న థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 8వ తేదీన గణితం, ఏప్రిల్ 10వ తేదీన సైన్స్ పరీక్ష, ఏప్రిల్ 11వ తేదీన సోషల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లుగానే నిర్వహిస్తున్నారు. ఇందులో జనరల్ సైన్స్ పరీక్షలో 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. అందులో ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ సైన్స్. జనరల్ సైన్స్ మెుదట ఓ పేపర్ ఇచ్చి దానికి సమాధానాలు రాసేందుకు 90 నిమిషాలు సమయం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత 20 నిమిషాల సమయం ఇచ్చి విద్యార్థులకు రెండో పేపర్‌ ఇవ్వాలని, రెండో పేపర్‌ రాసేందుకు మరో 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నల పత్రాన్ని పరీక్ష చివరి 15 నిమిషాల ముందు విద్యార్థులకు ఇవ్వనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

Latest Articles

జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌ తగిలింది. సీఐడీ స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిల‌ర్ అని సీఐడీ తేల్చింది. విజయ‌వాడ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్