బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. పి.గన్నవరం మండలం ముంగండ గ్రామంలో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వగ్రామానికి రావడంతో గ్రామస్తులంతా ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగుతూ ఆనందించారు. కవితో కాసేపు ముచ్చటించారు. దర్శనానంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఈ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని.. అలాంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం శుభపరిణామమన్నారు. బ్రిటీష్ హయాంలో కూడా ముంగండ గ్రామ ప్రజలు ఎంతో సాహసం చేసి దేవాలయాలను పరిరక్షించారని కొనియాడారు.
ఆంధ్ర ప్రదేశ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటన
0
408
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


