Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

టీడీపీలో చెలరేగిన అసంతృప్తి సెగలు

    ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా టీడీపీ లో అసమ్మతి సెగ రాజుకుంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించి 24 గంటలు కాక ముందే.. అసంతృప్తి పెల్లుబికింది. టికెట్ వస్తుందని భావించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కలువపూడి శివ అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాజీనా మా చేసే యోచనలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కే టీడీపీ సీటు కన్ఫర్మ్ కావడంతో ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ఆగ్ర‌హ జ్వాల‌లు చెలరేగాయి. శివరామరాజుకు టీడీపీ పార్లమెంటు సీటు అయినా ఇవ్వని పక్షంలో ఈ అసమ్మతి పార్టీ ఆగేలా కన్పించడం లేదు.

    ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 99 అసెంబ్లీ స్థానాలకు జనసేన- టీడీపి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిం చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. టీడీపీకి కంచుకోట ఉండి నియోజకవర్గంలో శివరామరాజు అలియాస్ కలవపూడి శివను కదని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సీటు కేటాయించడంతో శివరామరాజు వర్గం భగ్గుమంది. ఆగ్రహజ్వాలలు వ్యక్తం చేసింది.

     నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివరామరాజును పక్కన పెట్టి రామరాజుకు టిక్కెట్ ఇవ్వడంపై ఉండి నియోజక వర్గంలోని శివరామరాజు వర్గం నివ్వురుగప్పిన నిప్పుల ఉంది. టిడిపి వద్దు శివరామరాజు ముద్దంటు శివరామరాజు అభ్యర్థిగా ఉంటేనే తాము టిడిపి వెంట ఉంటామని, లేదంటే మీ వెంటే అంటూ శివరామరాజు మద్దతు దారులు నిరసన వ్యక్తం చేస్తు న్నారు. అవసరమైతే శివరామరాజు ను ఇండిపెండెంట్ గా గెలిపించుకుంటామంటూ, రెబల్ అభ్యర్థిగా బరిలో దిగాలని ఆయనపై కేడర్ ఓత్తిడి తెస్తోంది. పక్క పార్టీలు ఎన్ని ఆశలు చూపినా, పదవులు ఆశ చూపినా, పార్టీ జెండా మోస్తూ, ప్రజా సేవకుడిగా నియోజక వర్గంలో ప్రజలకు ఆత్మీయుడుగా ఉన్న శివరామరాజుకు ఎంపీ అయినా కేటాయించాలని ఆయన మద్దతు దారులు డిమాండ్ చేస్తున్నారు. శివరామరాజుకు న్యాయం చేయని పక్షంలో మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటు కేడర్ హెచ్చరిస్తు న్నారు.ప్ర‌జ‌ల్లో ఉండే నాయ‌కుడికి మేం గెలిపించుకుంటామంటున్న కేడ‌ర్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. ప్ర‌జ‌ల్లో సేవ చేసే నాయ‌కుడి సీటు లేక‌పోవ‌డం దారుణమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఉండి అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్న శివరామరాజుకు చంద్ర బాబు నమ్మకం ద్రోహం చేసారంటు కేడర్ రగలిపోతుంది. టిడిపి పార్టీ ఆత్మ‌గౌరవ పార్టీ అని చెప్పుకుం  టారు అయితే తమ నేతకు గౌర‌వం లేకుండా చేసిందంటున్న ఉండిలో పలువురు కార్యకర్తలు అంటు న్నారు. టికెట్‌ దక్కకపోవడంతో కలవపూడి శివ రాజీనామా చేస్తారంటు జోరుగా ప్రచారం జరుగుతుంది. తీవ్ర మనోవేదనకు గురైన శివరామరాజు నియోజక వర్గ ప్రజలు అభిప్రాయం తీసుకొని తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

గెలుపు గుర్రాలకోసం అన్వేషిస్తున్న వైసీపీ పార్టీ ఇపుడు తాజాగా కలువపూడి శివరామరాజు పై పోక‌స్ పెట్టింది. తన నిర్ణయాన్ని కొద్ది రోజుల్లో ప్రకటిస్తానని కలవపూడి శివ తెలిపినట్లు సమచారం. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తాడనుకోలేదంటూ కేడర్ ఇప్పటికే మండితున్నారు. 2019లో చంద్రబాబు మాట ప్రకారం ఉండి నుండి నర్సపురం ఎంపీగా పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓటమిపాలైయ్యారు శివరామరాజు. 2005 లో శివ స్వ‌చ్చంద సంస్ద ద్వారా ప్ర‌జ‌ల‌కు సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. 2009, 2014లో ఉండి నియోజక వర్గంలో విజయడంకా మోగించారు శివరామరాజు ఈ సారి మరల ఉండి నియోజక వర్గంలో టిడిపి జెండా రెపరెపలాడించేందుకు సిద్దం అయ్యారు. ప్రచారం కూడా ప్రారంభించారు … అయినా.. పార్టీ అన్యాయం చేసేందనే బాధలో కుమిలి పోయారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్నా, శివరామరాజు నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్