నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ మొత్తం ఫెయిలైందన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్. ఆనాడు కేసీఆర్ చేసిన రుణమాఫీ రైతుల బ్యాంకు వడ్డీలకే సరిపోయిందన్నారు. మేం రైతు తీసుకున్న రుణం, వడ్డీ మొత్తం కలిపి మాఫీ చేశామని ఉత్తమ్ తెలిపారు. 2018లో రైతు రుణమాఫీపై ఫిర్యాదులు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. డిసెంబర్ నెలలో రుణమాఫీ చేస్తామని చెప్పి జూలైలోనే మొదలు పట్టామని తెలిపారు. 4లక్షల 83వేల మంది రేషన్ కార్డుల్లో తప్పులున్నాయన్న ఆయన లక్షా 20వేల మంది రైతులు ఆధార్ నెంబర్లు తప్పుగా ఇచ్చారన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే మాఫీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్.