బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ఆ అవసరం కాంగ్రెస్ కే ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఏబీవీపీ నుంచి వచ్చారు కాబట్టి బీజేపీలోకి పోతారని కేటీఆర్ అంటున్నారని.. మరి కాంగ్రెస్ నుంచి వచ్చిన కేసీఆర్.. కాంగ్రెస్ లోకి వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. ఇరు పార్టీల మధ్య ఇచ్చుపుచ్చుకునే విషయంలో మాట ముచ్చట అంతా పూర్తయిందని ఇక చేరికలు మాత్రమే మిగిలాయని చెప్పారు. అందువల్లే ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కిందని..కాళేశ్వరంపై విచారణ అడ్రస్‌లేకుండా పోయిందని బండి సంజయ్ ఆరోపించారు.