ఈనెల 23న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాల పనులు చేపట్టవచ్చని అన్నారు. అలాగే ఈ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని… ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చుపెట్టాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని స్పష్టంచేశారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల వరకు ఈ పథకం అమలులో బాధ్యత తీసుకోవాలని తెలిపారు.