Sikkim Insident | సిక్కిం రాష్ట్రంలో విషాదం నెలకొంది. గ్యాంగ్ టక్ నుండి నాథులా వెళ్ళే హైవే పై మంచు కొండ చివరలు విరిగి పడడంతో ఏడుగురు మంచుకొండల్లో ఇరుక్కొని మృతి చెందారు. అక్కడే ఉన్న మరో 23 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే రెస్క్యూ టీమ్ హుటాహుటిన సమీపాన ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు మంచుచరియల్లో ఇరుక్కుపోయిన వారిని వెలికి తీసేందుకు వేగంగా పొడుగాటి పారలతో మంచును తోడుతూ ప్రయత్నిస్తున్నారు. తాజా పరిస్థితులను చూస్తే… మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది. నాతులా వెళ్ళే దారిలో మంచు అడ్డుపడడంతో మొత్తం 80 వాహనాలు నిలిచిపోయి ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారమా. .ఈ వాహనాల్లో దాదాపుగా 350 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు ఎటు వెళ్ళలేని పరిస్థితి.. మరే మంచుకొండలైన విరిగి మామీదకు కూడా పడుతుందా అని.. భిక్ఖు బిక్కుమంటున్నారు. అయితే వీరిని కాపాడేందుకు సహాయక టీమ్ బృందాలు గట్టిగా కృషి చేస్తున్నాయి.


