అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధిగా శివకృష్ణంరాజును ప్రకటించింది ఏపీ బీజేపీ. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ములగపాటి శివరామకృష్ణ రాజు తండ్రి రామరాజు. శివ రామకృష్ణ రాజు భారత సైన్యంలో చేరి దాదాపు 9 రాష్ట్రాలలో మిలిటరీ ఇంటలిజెన్స్ విభాగంలో 16 సంవ త్సరాలు వివిధ స్థాయిలలో పనిచేశారు. తండ్రి అనారోగ్య కారణాల రీత్యా సైన్యం నుండి పదవీ విరమణ తీసుకొన్న తరువాత RSSలో ప్రధార ప్రముఖ్‌గాచేశారు. తరువాత బీజేపీలో చేరి మండల అధ్యక్షుడిగా, నియో జకవర్గ కో ఆర్డినేటర్‌గా, జిల్లా మీడియా ప్యానలిస్ట్‌గా అంచలంచలుగా ఎదిగి రెండు సంవత్సరాల నుండి అనపర్తి నియోజకవర్గ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శివ రామకృష్ణరాజు విశేష కృషి చేశారు. దీంతో.. ఆయననే అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం.
అనపర్తి అసెంబ్లీ సీటును శివకృష్ణంరాజుకు కేటాయించిన బీజేపీ
0
436
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


