కాంగ్రెస్‌కు బిగ్ షాక్ .. బీఆర్‌ఎస్‌లో చేరిన ముఖ్య నేత

స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీని వీడిన సీనియర్ నేత నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ గూటికి చేరారు. మంత్రి కేటీఆర్ బుధవారం బేగంపేటలోని తన క్యాంపు కార్యాలయంలో శ్రీధర్‌‌కు కండువా కప్పి ఆహ్వానించారు. శ్రీధర్‌కు కాంగ్రెస్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. జీవితాంతం పార్టీ కోసమే పనిచేసిన ఆయనను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ పార్టీలో ఆయనకు సముచిత స్థానమిచ్చి గౌరవించుకుంటామని ఆన్నారు. తన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీధర్ కోరారని, ఆయన కోరిక మేరకు ఆయా నేతలను గౌరవించుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మల్కాజిగిరిలో బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు కృషి చేయాలని కేటీఆర్ శ్రీధర్‌ను కోరారు.
కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తం, చెమట ధారపోసినా సరైన స్థానం దక్కలేదని నందికంటి శ్రీధర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్ నాయకత్వంలో ఇకపై పనిచేస్తానని చెప్పారు. మాల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావును ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీధర్ వెంట వచ్చిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.

Latest Articles

బండి భగీరథ్‌ను అరెస్టు చేశాము.. సరెండర్‌ అవ్వలేదు- రేవంత్‌ రెడ్డి

బండి భగీరథ్‌ను అరెస్టు చేశామని.. సరెండర్‌ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పా జంక్షన్లో వాహనాల తనిఖీల్లో భగీరథ్‌ పోలీసులకు చిక్కాడని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్ట ప్రకారం వెళ్లామని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్