స్వతంత్ర, వెబ్ డెస్క్: అభిమానులకు నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు కానుక వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ‘భగవంత్ కేసరి’ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలంగాణ యాసలో బాలయ్య పలికిన డైలాగ్స్ అదిరిపోయాయి. ‘అడవి బిడ్డా.. నేలకొండ భగవంత్ కేసరి’ అంటూ యాక్షన్‌లోకి దిగడం.. ‘ఈ పేరు చానా ఏళ్లు యాదుంటది’ అనే డైలాగ్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. ఇక బాలయ్య సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తోంది. సినిమా కథ అంతా తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కొనసాగనుందని తెలుస్తోంది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి – హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా పండుగకి విడుదలకానుంది.
‘ఈ పేరు శానా ఏళ్లు యాదుంటది’ అంటున్న బాలయ్య
0
372
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


