కేంద్ర మంత్రి పదవి లభించడంపై సంతోషం వ్యక్తం చేసిన బండి సంజయ్‌

కేంద్ర మంత్రి పదవి లభించడం పట్ల బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. చాలా ఆనందంగా ఉందని, తనపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు లభించిన మంత్రి పదవి కార్యకర్తల కృషి ఫలితమేనని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

  ముఖ్యంగా తనపై నమ్మకం ఉంచి రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల వల్లే కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని బండి సంజయ్ అన్నారు. ఎప్పటికీ కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. మంత్రిగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగిస్తానన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు అనంతరం వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలను పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతున్నానన్నారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో సహాయ సహకా రాలందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Latest Articles

జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం

జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్