మహారాష్ట్రలో ఎన్నికల వేళ …ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లిగడ్డల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది . దీంతో ఉల్లిగడ్డ కు మార్కెట్ లో రేట్ పెరిగే అవకాశం ఉంది. దేశంలో మూడో విడత పోలింగ్ కు కేవలం రెండు రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మహారాష్ట్రలో గెలుపు ఓటములను నిర్ణయించే వారిలో ఉల్లి రైతులు కీలకం. ఎగుమతి చేసే టన్ను ఉల్లిగడ్డల కనీస ధర 550 అమెరికా డాలర్లుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిపై చేసింది.ఉల్లి ఎగుమతులను నిషేధిత కేటగిరీలో ఉంచుతూనే, బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ సహా కొన్ని దేశాల నుంచి విజ్ఞప్తులు అందడంతో ఇప్పటికే పరిమిత ఎగుమతులకు ప్రభుత్వం అనుమతిస్తోంది. మహారాష్ట్రకు చెందిన ఉల్లి వ్యాపారులు, రైతులు నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఉల్లిగడ్డల ఎగుమతి వల్ల దేశీయంగా ధరలు పెరుగుతాయనే భయంతో ప్రభుత్వం ఇంతవరకూ నిషేధం కొనసాగిస్తూ వచ్చింది.
ఉల్లి గడ్డల ఎగుమతిపై నిషేధం ఎత్తివేత
0
342
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


