స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లిలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇటీవల నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల కో-ఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. అనంతరం మూడు రోజుల నుంచి హైదరాబాద్ లో ఉన్న బాలినేనిని తాడేపల్లి రావాలని కబురు పంపించారు. దీంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన బాలినేని జగన్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తన ప్రాధాన్యత తగ్గించేలా కొందరు పనిచేస్తున్నారని సీఎం జగన్‌కు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. బాలినేని ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించిన జగన్.. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల సమన్వయకర్తగా మళ్లీ బాధ్యతలు తీసుకునేలా బాలినేనిని బుజ్జగించినట్టు సమాచారం.
తాడేపల్లిలో బాలినేనిని బుజ్జగించిన సీఎం జగన్
0
287
Latest Articles
breaking: కార్మికులపై పడ్డ ద్రవ ఉక్కు…8 మంది కార్మికులు మృతి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్టీల్‌ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ప్రమాదం సంభవించింది. సీసీడీ విభాగంలో...
- Advertisement -
- Advertisement -


