Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ప్రశ్నార్థకంగా మారిన బాజిరెడ్డి రాజకీయ భవిష్యత్ ….

 పార్లమెంటు ఎన్నికలు రాజకీయ పార్టీలకు చావో .. రేవో.. అన్న ఓ విధమైన సవాల్.. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైన వేళ… పదేళ్లు ఓ వెలుగు వెలిగిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ నుంచి నాయకులు ఒక్కొక్క రుగా తప్పుకుంటు న్నారు. పక్కపార్టీల వైపు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండటంలేదు. నిజామా బాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాజిరెడ్డి గోవర్థన్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటు న్నారు. ఇప్పుడు ఆయనకు నియోజ కవర్గంలోని అన్ని సెగ్మెంట్ల నుంచి నాయకుల సహకారం కరువైంది. కోరుట్ల, జగిత్యాల, బాల్కొండ నియోజకవర్గాలు బాజిరెడ్డికి కొంత ఊరట నివ్వవచ్చు.

బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి . బాజిరెడ్డి జిల్లాలో చాలా సీనియర్ నేత. మంచి పట్టుంది. బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గం నేత. అయితే ప్రస్తుతం బిఆర్ ఎస్ పార్టీ పరిస్థితి భిన్నంగా మారింది. జిల్లాలో క్యాడర్ కాంగ్రెస్, బిజెపి వైపు చూస్తున్నారు. కీలక నాయకులు పక్క పార్టీల కు వెళ్లిపోతున్నారు. గత పదేళ్ళుగా జిల్లా పూర్తిగా గులాబీ గుప్పిట్లో ఉండేది. ప్రస్తుతం పార్టీ పరిస్థితి మారింది. ఇప్పటికే ఆర్మూర్ మున్సిపాలిటీ, డిసిసిబి చైర్మన్ పదవు లు కూడా కాంగ్రెస్ వశమయ్యాయి.

మరోవైపు జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేల సహకారం బాజిరెడ్డికి ఏ మేర ఉంటుందో అన్నది ప్రశ్నగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యేలు జిల్లాకు రావటమే మానేశారు. పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం అందుబాటులో లేకపోవటం ఈ ఎంపీ ఎన్నికల్లో బాజిరెడ్డికి కొంత ఇబ్బందికర పరిణామాలే అంటున్నాయి పార్టీ శ్రేణులు. మరోవైపు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇప్పటి వరకు కార్యకర్తల సమావేశాలు నిర్వహించలేదు. క్యాడర్ ను సమన్వయం చేయటం లేదంటున్నారు. అటు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో చిక్కుకున్నాడు. అసలు షకీల్ ఎక్కడున్నాడు అనే విషయం కూడా తెలియని పరిస్థితి. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు.

బాజిరెడ్డి గోవర్ధన్ కు జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మద్దతు ఉండటం కొంత ఉరటనిచ్చే అంశం. అక్కడ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక బాల్కొండలో ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సమావేశాలు నిర్వహి స్తున్నారు. ఈ మూడు నియోజ కవర్గాల్లో బాజిరెడ్డి గోవర్ధన్ కు ఇబ్బంది లేనప్పటికీ మిగతా 4 నియోజకవర్గాల్లో ఆయన కష్టపడాల్సి వస్తోందంటున్నారు. బాజిరెడ్డి పొలిటికల్ జర్నీలో ఎప్పుడూ క్లిష్ట పరిస్థితుల్లోంచే గెలుపు తీరాలు దాటుతూ వచ్చారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, జిల్లా మీద పట్టుఉం డటం, మున్నూరు కాపు సామాజిక వర్గం నేత కావటం బాజిరెడ్డికి కొంత కలిసొచ్చే అంశాలు. గతంలో బాజిరెడ్డి సీనియర్ లీడర్లు సంతోష్ రెడ్డి, డి. శ్రీనివాస్, పోచారం శ్రీనివాస్ రెడ్డిలను ఓడించిన పేరుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బిఆర్ ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యేలు, బిఆర్ ఎస్ క్యాడర్ అంతా ఏకమైతేనే గులాబీ పార్టీ ప్రభావం ఎంపీ ఎన్నికల్లో కనిపిస్తుందంటున్నరు. బాజిరెడ్డికి జిల్లాలో ఉన్నఫాలోయింగ్, మాస్ లీడర్ కావటం, సీనియర్ నేత కావడంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజాబలంతోపాటు అన్ని అంశాలు కలిసి వస్తేనే విజయం.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్