స్వతంత్ర వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం అవినాశ్ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు తమ వాదనలను హైకోర్టుకు వినిపించారు. అనేక వాదోపవాదనలు అనంతరం భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత తీర్పు వస్తుందని భావించినా, సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించడంతో… ఈరోజు సీబీఐ వాదనలు ఎక్కువగా వినిపించేందుకు అవకాశం దక్కలేదు. సమయం లేని కారణంగా శనివారం సీబీఐ వాదనలు వింటామని హైకోర్టు పిలుపునిచ్చింది. దీంతో అవినాశ్ ముందస్తు బెయిల్ పై ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది.