స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ వైఎస్ అనినాశ్ రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్ విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఈ పిటిషన్ విచారించే అవకాశం ఉంది. కాగా మంగళవారం విచారణకు రావాలని అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు పంపగా.. తాను రాలేనని లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆయన లేఖపై సానుకూలంగా స్పందించిన సీబీఐ అధికారులు ఈనెల 19న విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు.