స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా మేనల్లుడు సాయితేజ్ కలిసి నటిస్తున్న చిత్రం నుంచి క్రేజీ అప్టేడ్ వచ్చింది. సీనియర్ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ రేపు సాయంత్రం 4.14నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టరును చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పవన్ కల్యాణ్ మరో మెగా హీరోతో నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా తమిళంలో సముద్రఖనినే తెరకెక్కించిన ‘వినోదయా సితం’ సినిమాకి ఇది రీమేక్. 2021లో తమిళనాడులో విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. తెలుగులో పవన్ కల్యాణ్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఈ చిత్రంలో మార్పులు చేర్పులు చేశాడు దర్శకుడు.