మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ విచారణలో కేటీఆర్‌తో పాటు తన లాయర్ కూర్చోవడానికి వీల్లేదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఏసీబీ ఆఫీసులో కేటీఆర్‌కు దూరంగా లాయర్లు ఉండేందుకు అనుమతి ఇస్తామంది. తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.
మరోవైపు కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్‌ఆర్ టోల్ లీజ్‌లో అవకతవకలు జరిగాయంటూ బీసీ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు యుగంధర్ గౌడర్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయంపై ఈడీకి సైతం ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తో పాటు కేసీఆర్ మీద కూడా ఈడీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరారు. బిఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ స్కృటినీ చేసి ప్రభుత్వ కాంట్రాక్టు, పాలసీ నిర్ణయాలపై దర్యాప్తు జరపాలని ఫిర్యాదు చేశారు.