అవనిగడ్డ ఎమ్మెల్యేపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారా?

     ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో ఒకటి అవనిగడ్డ. ఈ అసెంబ్లీ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. గత యాభై ఏళ్లలో ఒకే ఒక్కసారి మినహా మిగిలిన అన్ని సందర్భాల్లోనూ కేవలం రెండు కుటుంబాల వారే గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సింహాద్రి రమేష్ అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి.. ఆయన పాలనపై ప్రజలు ఏమంటు న్నారు ?

     యాభై ఏళ్లు.. కేవలం ఒక్కసారి మాత్రమే.. ఏంటి ఈ గణాంకాలు అనుకుంటున్నారా ! అక్కడికే వస్తున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి ఓ అరుదైన, ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గత యాభై ఏళ్లలో ఇక్కడ కేవలం ఒక్కసారి మినహా మిగిలిన అన్ని సందర్భాల్లోనూ రెండు కుటుంబాల వారే గెలుస్తూ వస్తు న్నారు. 1970 నుంచి మండలి కుటుంబం, సింహాద్రి కుటుంబ సభ్యులు మాత్రమే గెలుస్తున్నారు. అయితే.. కేవలం ఒకే ఒక్కసారి ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది. 2009 ఎన్నికల్లో మాత్రం అంబటి బ్రాహ్మణ య్య గెలు పొందారు. ఇది ఓ రికార్డ్. అయితే ఆయన అకాల మరణంతో 2013లో జరిగిన ఉప ఎన్నికల్లో బ్రాహ్మ ణయ్య కుమారుడు అంబటి శ్రీహరి ప్రసాద్ప్రా తిని థ్యం వహించారు. అయితే.. కేవలం ఆరునెలలు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం అవనిగడ్డ ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ ఉన్నారు. 2009 ఎన్నికల్లో తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన.. పీఆర్పీ తరపున బరిలో దిగి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన 2014 ఎన్నికల్లో బరిలో దిగి, టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ చేతిలో సుమారు ఆరువేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ముచ్చటగా మూడోసారి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి దిగి బంపర్ విక్టరీ కొట్టారు. టీడీపీ కేండిడేట్ మండలి బుద్ద ప్రసాద్‌పై ఇరవై వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొంది విజయ బావుటా ఎగురవేశారు సింహాద్రి రమేష్.

            రానున్న 2024 ఎన్నికల్లోనూ మరోసారి అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ అదృష్టం పరీక్షిం చుకుంటున్నారు సింహాద్రి రమేష్. ఇక, ఎమ్మెల్యే పనితీరు విషయానికి వస్తే.. మొదట్లో అంతగా నియోజ కవర్గంపై దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. అయితే అధినేత జగన్ హెచ్చరికలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్. ప్రత్యే కించి ప్రభుత్వం తరఫున నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చూడ డంలో సక్సెసయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రశ్నిస్తే.. నిధుల లేమితో ఎక్కువ శాతం పనులు ఎమ్మెల్యే చేయలేకపోయారన్న వాదన బలంగా విన్పిస్తోంది. అవని గడ్డలో గెలిచేది మేమంటే మేమంటూ అన్ని పార్టీలూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగానే.. ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నెరవేర్చని హామీల గురించి పెద్ద ఎత్తున చర్చ జరు గుతోంది. సీఎం జగన్ అవినిగడ్డ వచ్చిన సమయంలో వంద కోట్ల రూపాయల మేర అభివృద్ధి కార్య క్రమాలకు హామీలిచ్చారు. అయితే.. వాటి విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రభుత్వం తరఫున మంజూ రైన నిధుల తో పనులు చేయించాల్సిన ఎమ్మెల్యే.. వాటి గురించే పెద్దగా సీరియస్‌గా లేకపోవడం మైన స్సేనన్న మాట విన్పిస్తోంది.

      ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. ఆ హామీలను నెరవేర్చలేదంటూ ఎమ్మెల్యే ఆఫీసు ముందు ధర్నా చేయటానికి వచ్చిన జనసేన నాయకులు, వీర మహిళలపై.. సింహాద్రి రమేష్ అనుచరులు దాడులు చేయడం, అందులో స్వయంగా ఎమ్మెల్యే కూడా పాల్గొనడం కలకలం రేపింది. తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక, నాటి మచిలీపట్టణం ఎంపీ బాలశౌరి అనుచరుడిని సైతం ఎమ్మెల్యే వర్గీయులు కొట్టడం సొంత పార్టీ నేతల్లోనే విబేధాలకు దారి తీసింది. నియోజకవర్గంలో ప్రధానంగా రోడ్ల సమస్య ఎక్కువగా ఉంది. డ్రైనేజీలు బాగు చేసిందీ అంతంత మాత్రమేనన్న విమర్శలున్నాయి. ఇక, పారిశుద్ధ్యం సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిదన్న వాదన విన్పిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే.. నియోజకవర్గంలో కడవకొల్లు నరసింహారావు వ్యవ హార శైలిలో ఎన్నో విమర్శలున్నాయి. ఆయన షాడో ఎమ్మెల్యేగా వ్యవహిరించారన్న ఆరోపణలు ఎక్కువగా విన్పించాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే తన వ్యాపార భాగస్వామి.. డాక్టర్ శ్రీహరి హత్య కేసు తీవ్ర దుమారమే రేపింది. ఈ మర్డర్ కేసును ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోకపోవడంతోపాటు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారన్న ఆరో పణలు ప్రత్యర్థుల నుంచి గట్టిగా విన్పిస్తున్నాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో అంతర్గతంగా ఏం జరిగిందో అన్నది ఇప్పటికీ తెలియలేదని ఆరోపిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. మొత్తంగా చూస్తే, ప్రభుత్వం తరఫున జగన్ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు మినహా ఎమ్మెల్యే పెద్దగా చేసిందేమీ లేదన్న వాదన గట్టిగా విన్పిస్తోం ది. దీంతో.. నియోజకవర్గ ప్రజలు సింహాద్రి రమేష్‌కు వందకు నలభై ఐదు మార్కులు వేశారు. నిధుల కొరత కారణంగా కొన్ని హామీలు నెరవేర్చలేకపోయానని.. మరోసారి అవకాశం ఇస్తే కచ్చితంగా ఇచ్చిన హామీలు నిలబె ట్టుకుంటానని చెబుతున్నారు ఎమ్మెల్యే. మరి.. నియోజకవర్గ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? అన్నది ఆసక్తి రేపుతోంది.

Latest Articles

తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్