స్వతంత్ర వెబ్ డెస్క్: వరల్డ్ టూరిజం మ్యాప్లో ఏపీకి ప్రత్యేక స్థానం ఉండాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హెటల్ను ఆయన ప్రారంభించారు. విజయవాడకు మంచి ఇంటర్నేషనల్ హోటల్స్ ఇంకా రావాలని.. అవి రాష్ట్ర మంతటా విస్తరించాలని జగన్ ఆకాంక్షించారు. దీన్ని చూసి మరో నలుగురు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని అన్నారు. వారందరికీ తమ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని చెప్పారు.
ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో ఏపీకి ప్రత్యేకమైన స్ధానం ఉండాలని ప్రత్యేక టూరిజం పాలసీని తీసుకొచ్చినట్లు జగన్ చెప్పారు. మంచి టూరిజం పాలసీని తీసుకునిరావడమే కాకుండా.. మంచి చైన్ హోటల్స్‌ను కూడా ప్రోత్సహించామన్నారు. ఒబెరాయ్‌తో మొదలుకుని ఇవాళ ప్రారంభమైన హయత్ వరకు దాదాపు 11 పెద్ద బ్రాండ్లకు సంబంధించిన సంస్ధలన్నింటినీ ప్రోత్సహించినట్లు చెప్పారు.