స్వతంత్ర వెబ్ డెస్క్: నవరత్నాల పేరుతో నవ మోసాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని టిడిపి హెచ్చరించింది. మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ హేట్స్ జగన్ అనే పుస్తకాన్ని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు మరియు ఇతర నేతలు విడుదల చేశారు ఈ సందర్భంగా టిడిపి నేతలు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ చార్జీల భారమే రూపాలు 64 వేల కోట్లని మండిపడ్డారు. నాసిరకం మద్యంతో 35 లక్షల మందిని రోగాల బారిన పడేలా చేశారని 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయంలో తాడేపల్లి ప్యాలెస్ లక్ష కోట్ల కమిషన్ కొట్టేసిందని దుయ్యబట్టారు తన దోపిడీని ఎదుటి వారికి అంత గట్టి చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజాం అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.