కమ్మ, రెడ్డి సెటిలర్లపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. సీనియర్ నేతగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో పేరు పొందారు. గిరిజన నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వవహిస్తున్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్రంలోని రెండు ప్రముఖ సామాజికవర్గాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కమ్యూనిటీస్ ప్రజల తీరు వల్ల తన నియోజవర్గం నష్టపోతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మరో హాట్ కామెంట్స్ చేశారు. కమ్మ, రెడ్డి సెటిలర్ల వల్ల సాలూరు ప్రాంతంలోని గిరిజనులకు నష్టం జరుగుతున్నట్లు తెలిపారు. గిరిజన ప్రయోజనాలు కాపాడేందుకు ఈ నియోజకవర్గాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించాలని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన సెటిలర్లు ఇక్కడి గిరిజనుల దగ్గర సంపాదించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు.

Latest Articles

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమేనా?

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాబోయే 2028 ఎన్నికల్లో ముఖాముఖి పోరు ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్