రేపు ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు కేబినెట్ భేటీ జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై చర్చించనున్నారు. దీంతో పాటు పలు సంక్షేమ పథకాలపై కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇక, రైతు భరోసా హామీలు, పలు కంపెనీలకు భూముల కేటాయింపులు, వైన్ షాపుల్లో 10 శాతం గీత కార్మికులకు కేటాయించడం తదితర అంశాలపై కూడా చర్చించబోతున్నట్టు సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.

Latest Articles

ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..

బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్