37.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

Aditya L-1 Mission: ఇక సూర్యుడే టార్గెట్… తగ్గెదేలే అంటున్న ఇస్రో..!

స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రుడిని ముద్దాలనుకున్న చిరకాల స్వప్నం తీరిపోయింది. చంద్రయాన్-3(Chandrayan3) ఆ కలను సాకారం చేసింది. చంద్రుడి రహస్యాలను శోధించే పనిలో ప్రజ్ఞాన్ రోవర్(Pragnan Rover) బిజీగా ఉంది. ఈ విజయం ఇచ్చిన ఆత్మ విశ్వాసంతో ఇప్పుడు ఇస్రో(ISRO) సూర్యుడిని టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆదిత్య ఎల్-1ను(Aditya L-1 Mission) ఇస్రో ప్రయోగించబోతోంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి సెప్టెంబర్ 2 మధ్యాహ్నం 11.50 గంటలకు దీన్ని ప్రయోగించనున్నారు.
సూర్యుడిపై ప్రయోగాలకు ఇస్రో చేస్తున్న తొలి ప్రయత్నం ఇదే. సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను తెలుసుకోవడం కోసమే.. ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపడుతోంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో (ఎల్1 పాయింట్) శాటిలైట్ ను ఇస్రో ఉంచబోతోంది. మొత్తం 177 రోజుల పాటు ఇది ప్రయాణం చేసి, ఆ కక్ష్యలోకి చేరుకుంటుంది.
సూర్యుడు ఎలా పుట్టాడు? అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? అనే వివరాలతో తెలుసుకోవడంతో పాటు కాంతిమండలం (ఫొటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్), సూర్యుని బయటి పొరలపై అధ్యయనం చేస్తారు. గ్రహణాల ప్రభావం కూడా లేకుండా సూర్యుడిపై ఉపగ్రహం నిరంతరం పరిశోధన జరుపుతుంది.

Latest Articles

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌లో టీమిండియా

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్‌లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్