సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు విచారణకు హాజరుకాలేదు. షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అతని తరపు లాయర్ కోరారు. అల్లు అర్జున్ మినహా నిందితులందరూ విచారణకు హాజరయ్యారు. అనంతరం విచారణను జులై 6కు వేసింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ11గా ఉన్నారు.
వర్చువల్ విచారణకు హాజరుకాని అల్లు అర్జున్.. ఆయన న్యాయవాది ఆబ్సెంట్ పిటిషన్ వేశారు. జులై 6న విచారణకు కూడా వర్చువల్‌గా హాజరవుతారని.. అల్లు అర్జున్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.2024 డిసెంబర్ 4న సంథ్య థియేటర్ దగ్గర పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.


