స్వతంత్ర, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ ఆత్మను నేటికి చంపుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ మరణానికి కారకులైన వారంతా ఒక చోట చేరి మహానాడు.. శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల ప్రణాళికకు విలువ లేదని జోగి రమేష్ ఆరోపించారు. 2014 ఎన్నికల ముందు 600 పైచిలుకు హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి కనీసం ఒక్క హామీనైనా ప్రజల దరికి చేర్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు బీసీలను బానిసలుగానే చూసారని.. వారి మేలు కోసం ఏనాడు ప్రయత్నం చేయలేదన్నారు. బీసీలకు ఆత్మగౌరవం వైసీపీ ప్రభుత్వంలో సాధ్యమైందని అన్నారు.