స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మేం అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం నిర్మాణంలో అవినీతిపై విచారణ చేపడుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం, అమరవీరుల స్థూపం అక్రమాలపై విచారణ చేపడుతామన్నారు. సచివాలయ ప్రారంభోత్సవంలో సీఎం ప్రోటోకాల్ పాటించలేదని మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలో మెట్టుగడ్డ నుంచి క్లాక్ టవర్ వైపు జరిగిన ర్యాలీలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ర్యాలీలో రేవంత్ రెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
అధికారంలోకి రాగానే సచివాలయ నిర్మాణంలో అవినీతిపై విచారణ: రేవంత్ రెడ్డి
0
340
Latest Articles
రక్తం అమ్ముకుని సంపాదించాల్సిన అవసరం ఉందా..? బ్లడ్ బ్యాంక్ వివాదంపై చిరంజీవి
ఎన్ని విమర్శలు వచ్చినా.. బ్లడ్ బ్యాంక్ విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి తన వాదనను మరోసారి స్పష్టంగా వినిపించారు. గతంలో తన బ్లడ్ బ్యాంక్ చుట్టూ రేగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ.. రక్తాన్ని అమ్ముకుని...
- Advertisement -
- Advertisement -


