పాకిస్తాన్ పై అఫ్గాన్ సంచలన విజయం.. చరిత్రలోనే మొదటిసారి..!

స్వతంత్ర వెబ్ డెస్క్:  వన్డే ప్రపంచ కప్ లో మరో సంచలన విజయం నమోదు అయింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై అఫ్గాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 283 పరుగుల లక్ష్యాన్ని అప్ఘాన్ 49 ఓవర్లలో సునాయసంగా చేధించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను చేజ్ చేసింది. అప్గాన్ బ్యాటింగ్ లో ఓపెనర్లు ఇబ్రాహీ 87, గుర్బాజ్ 65 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్ ఆడారు. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన రెహమత్ (77) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్ ఆడాడు. హష్మతుల్లా కూడా 48 పరుగులు చేశాడు. అప్గానిస్తాన్ బ్యాట్స్ మెన్లను అడ్డుకట్ట వేసేందుకు పాక్ బౌలర్ల వల్ల కాలేదు. ఇప్పటికే వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై ఓ సంచలన విజయం నమోదు చేసింది అప్గాన్. పాక్ పై గెలిచి మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. పాక్ బ్యాటింగ్ లో షఫిక్ 58, కెప్టెన్ బాబర్ ఆజం 74, షాదాబ్ ఖాన్ 40, ఇఫ్తికర్ అహ్మద్ 40 పరుగులు చేశారు. అప్గాన్ బౌలింగ్ లో నవీన్ హుల్ హక్ 2, నూర్ అహ్మద్ 3 వికెట్లు తీశారు. నబీ, అజ్మతుల్లా తలో వికెట్ తీశారు. తరువాత బ్యాటింగ్ కి అప్ఘాన్ 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్ని అందుకుంది. 283 పరుగుల ఛేజింగ్ లో అప్గాన్ టాపార్డర్ అదరగొట్టింది. 49వ ఓవర్ చివరి బంతికి హష్మతుల్లా 4 బాదడంతో సరికొత్త రికార్డు నమోదు అయింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇబ్రహీం జద్రాన్ ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్