24.2 C
Hyderabad
Monday, November 3, 2025
spot_img

ఆటోను ఢీకొన్న ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం… ఒకరు మృతి

     ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం ఆటోను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలైన సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమ యంలో త్రిపురాంతకం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ఇజ్రాయిల్ , అతని ఇద్దరు స్నేహితులు కుంట గ్రామం నుండి త్రిపురాంత కానికి ఆటోలో బయలుదేరారు. అదే సమయంలో వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్ తో కలిసి పాల్గొనేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ తన ఎస్కార్ట్ తో కలిసి విజయవాడ నుండి మార్కాపురానికి బయలుదే రారు. త్రిపురాంతకం మండలం కేశినేని పల్లి గ్రామ సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మంత్రి ఎస్కార్ట్ వాహనం ఆటోను బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న ఇజ్రాయిల్ అక్కడికక్కడే మృతి చెందగా అతని మిత్రులు ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు

        అదే సమయంలో మంత్రి వాహనాన్ని ఆపి ప్రమాదాన్ని పరిశీలించకపోగా అక్కడనుండి కనీసం వాహనాన్ని కూడా ఆపకుండా మా అక్క పురం వెళ్లారు. అది గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా 108 వాహనంలో క్షతగా త్రులను మార్కాపురం వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనం తరం ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఇజ్రాయిల్ మృతి చెందడంతో ఆధారాన్ని కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ప్రమాద సమయంలో ముందు వాహనంలో ఉన్న మంత్రి ప్రమాద పరిస్థితిని ఆరా తీయకపోవడం దారుణమని స్థానికులు విమర్శిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్