స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సర్సీ హిల్స్‌లోని ఏడంతస్తుల భవనంలో బుధవారం సాయంత్రం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వ్యాపించడంతో భవనం పూర్తిగా కాలిపోయి కుప్పకూలింది. మంటల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 100 మంది అగ్నిమాపక సిబ్బంది 20 యంత్రాలతో మంటలను అదుపుచేశారు. ముందు జాగ్రత్త చర్యగా సమీప భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు.