భారీ అగ్ని ప్రమాదం.. నివాస గృహాలను ఖాళీ చేయించిన అధికారులు

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌ పరిధిలో ఆదివారం (మార్చి 12) రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మీర్ ఆలం పార్క్‌ సమీపంలోని ఓ కట్టెల గోడౌన్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో గౌడౌన్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పోలీసులు కూడా చేరుకొని.. సహాయక చర్యలను ప్రారంభించారు. అయితే కట్టెలు అడ్డుగా ఉండడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. సిబ్బంది, పోలీసులు మూడు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. దీంతో ముందు జాగ్రత్తగా గోడౌన్‌కు చుట్టుపక్కల వున్న నివాస గృహాలను అధికారులు ఖాళీ చేయించారు. ఈ ఘటన జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

Latest Articles

బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నారా?

రాజకీయాల్లో ఎంత కష్టపడి అధికారం సాధించామో, దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యంత్రాంగానికి గట్టి హెచ్చరికలే జారీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్