ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో యాక్సిడెంట్ జరగడంతో వాహనం నుంచిలో నగదు బయటపడింది. అనంతపల్లి వద్ద లారీ ఢీకొట్టడంతో తవుడు బస్తాలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. అయితే, ఈ వాహనంలో తవుడు బస్తాలు తరలిస్తున్నారని అందరూ అనుకోగా.. ఊహించని విధంగా తవుడు బస్తాల మధ్యలో అట్ట పెట్టెల్లో పెట్టి తరలిస్తోన్న నోట్ల కట్టలు బయటపడ్డాయి.7 పెట్టెల్లో బయటపడ్డ నోట్ల కట్టలు చూసి ఒక్కసారిగా ఖంగుతిన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు టాస్ ఏస్ వాహనంలో బయటపడ్డ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు పట్టుబడటంతో పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఐటీ ఆఫీసర్స్ నగదును లెక్కించే పనిలో పడ్డారు.
ఎర్ర కాలువ బ్రిడ్జి దగ్గర భారీగా బయటపడ్డ నగదు
0
340
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


