ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టు

సికింద్రాబాద్‌ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ శాంతినికేతన్ కాలనీ ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలిపోయింది. పెద్ద చెట్టు విరిగిపడడంతో ఒక్కసారిగా వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అయితే అదే సమయంలో ఎవరూ అటు వైపుకు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

ఈ ఘటన ఓల్డ్‌ బోయిన్‌ పల్లి పాత కళ్యాణ్ థియేటర్ ప్రాంతంలో జరిగింది. రహదారిపై ఒక్కసారిగా భారీ వృక్షం విరిగిపడింది. చెట్టుపడిపోయిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్‌ అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డివిజన్‌ పరిధిలో చాలా చోట్ల ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయని.. వాటిని గుర్తించి తొలగించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లేకపోతే చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్