ఢిల్లీలోని కేషోపూర్ మండి సమీపంలో బోరుబావిలో ప్రమాదవశాత్తు చిన్నారి పడిపోయింది. 40 ఫీట్ల బోరుబావిలో చిన్నారి పడిపోయింది. ఘటనాస్థలిలో ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. చిన్నారిని రక్షించే చర్యలు చేపట్టారు. బోర్వెల్కు సమాంతరంగా మరో బోరుబావి తవ్వేందుకు సన్నాహాలు చేస్తున్నామని NDRF బృందం తెలిపింది. చిన్నారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బోర్వెల్ లోతు 40 అడుగులుండగా దానిలోపల చిన్నారిని బయటకు తీయడం చాలా కష్టంగా మారింది. NDRF బృందం కొత్త బోర్వెల్ ను తవ్వడానికి చాలా సమయం పట్టే అవకావం ఉంది. బోరుబావి దగ్గర జేసీబీతో దాదాపు 50 అడుగుల మేర తవ్వకాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.