31.5 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

సీబీఐ 56 ప్రశ్నలు అడిగింది: సీఎం కేజ్రీవాల్

Delhi CM Kejriwal | ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు కేజ్రీవాల్​ను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తులో భాగంగా నిన్న సాక్షిగానే సీఎం కేజ్రీవాల్ ను విచారించింది. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ.. రాత్రి 8.30 గంటలకు ముగిసింది. విచారణ అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.

దాదాపు 9 గంటల పాటు నన్ను సీబీఐ ప్రశ్నించిందనిఅన్నారు. సీబీఐ అడిగిన 56 ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. లిక్కర్ స్కాంలో అన్నీ తప్పుడు ఆరోపణలతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆప్ ‘కత్తర్ ఇమాందార్ పార్టీ’. ఆప్‌ను అంతం చేయాలని బీజేపీ అనుకుంటున్నారని.. కానీ దేశప్రజలంతా మావైపే ఉన్నారని అన్నారు. అసలు మద్యం కుంభకోణం అనేదే లేదని.. ఇదంతా కావాలనే చేస్తున్నారని అన్నారు. కాగా కేజ్రీవాల్ విచారణను సీసీ కెమెరా పర్యవేక్షణలో సీఆర్‌పీసీ 161 కిందస్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అంతేకాకుండా లిఖితపూర్వకంగా కూడా స్టేట్‌మెంట్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్