ఏపీ మహిళలకు శుభవార్త… ఖాతాల్లో డబ్బులు పడ్డాయ్..!

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన సమావేశంలో సీఎం జగన్(CM Jagan) బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేశారు. సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ పథకంతో రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య కులాలకు చెందిన 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్లలోపు పేద మహిళలకు జగన్ సర్కారు రూ.15వేల చొప్పున ఖాతాల్లో వేసింది. ఈ పథకం ద్వారా మొత్తం 4,39,068 మంది ఖాతాల్లో రూ.658.60 కోట్లను జమచేసింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 45-60 ఏళ్ల లోపు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇప్పటివరకు ఇలాంటి పథకాలు అమలుచేయడం లేదని అన్నారు.

ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు సీఎం జగన్(CM Jagan). వైఎస్ఆర్ ఈబీసీ పథకంతో అక్కచెల్లెమ్మలను అన్ని విధాల ఆదుకుంటున్నామని అన్నారు. చిరునవ్వుతో కుటుంబాన్ని నడిపిస్తున్న గొప్ప వ్యక్తులు మహిళలని.. ఆ అక్కచెల్లెమ్మలకు తాను సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమం అక్కచెల్లెమ్మలకు భరోసా ఇచ్చే కార్యక్రమమని… అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నామని అన్నారు. ఓసీ వర్గాలోని అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్నదే తన లక్ష్యమని సీఎం తెలిపారు.

Read Also: మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న రోజా.. కేక్ కట్ చేసి…
Follow us on:  Youtube,  Koo,  Google News

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్