28.2 C
Hyderabad
Monday, December 23, 2024
spot_img

ఎన్నికల వేళ కర్ణాటకలో బోనీకపూర్ కారులో వెండి వస్తువులు లభ్యం

Boney Kapoor |కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజులు సమయమే ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల నేతలు హోరాహోరి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వం మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈసీ అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. దావణగెరె శివారులో గల హెబ్బళు టోల్ గేట్ సమీపంలో అధికారులు తనిఖీలు చేస్తుండగా ఓ బీఎండబ్ల్యూ కారులో రూ.39లక్షలు విలువచేసే వెండి వస్తువులు లభించాయి.

కారు డ్రైవర్ సుల్తాన్ బాషా, మరో వ్యక్తి హరిసింగ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో ఆ కారు ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. వెండి వస్తువులు కూడా బోనీ కపూర్(Boney Kapoor) కుటుంబానికి చెందినవేనని డ్రైవర్ వెల్లడించాడు. అయితే వాటికి సరైన పత్రాలు చూపించకపోవడంతో వాటిని సీజ్ చేశారు. అవి బోనీ కుటుంబానికి చెందినవా? కాదా? అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎన్నికల వేళ ఇంత భారీ మొత్తంలో వెండి వస్తువులు లభించండం తీవ్ర చర్చనీయాంశమైంది.

Read Also: వెట్రిమారన్-విజయ్ సేతుపతి ‘విడుదల-పార్ట్1’ తెలుగు ట్రైలర్ విడుదల

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

పేర్ని నాని కుటుంబానికి లుక్‌ అవుట్‌ నోటీసులు

ఏపీలో మాజీ మంత్రి పేర్నినాని వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రేషం బియ్యం దందా కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. నాని కుటుంబంపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్