ప్రభుత్వమే కథ అల్లి పోలీసులతో చెప్పిస్తుంది: ఎమ్మెల్యే రఘునందన్ రావు

బండి సంజయ్ కుమార్​ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు. లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు భరోసా కల్పించకుండా ఇలా రాజకీయాలు చేయడం తగదని అన్నారు. ప్రభుత్వమే కథ అల్లి పోలీసులతో చెప్పించినట్లు మేం భావిస్తున్నామని తెలిపారు. వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాకు చెప్పిన అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినవేనని అన్నారు. శివ గణేశ్ తీసిన ఫొటో మొదట ఎవరికి వెళ్లింది. ఆ పేపరు ఎంత మందికి వెళ్లిందో.. ఆ అందరినీ విచారించారా..? అంటూ ప్రశ్నించారు.

అధికార పార్టీని సంతృప్తి పరిచేందుకు సీపీ వ్యవరిస్తున్న తీరు సరికాదని రఘునందన్(Raghunandan Rao) వ్యాఖ్యానించారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు జరిగిన అన్యాయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. మేమేమైనా గోడ దూకి వెళ్లి హిందీ పేపర్‌ ఫొటో తీసినట్లు చెబుతున్నారు. ఫొటో తీస్తుంటే పోలీసుల నిఘా ఎక్కడ ఉంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బండి సంజయ్‌కు ఉదయం 11.20 తర్వాత పేపర్‌ వచ్చిందని చెబుతున్నారు. ఫొటో తీసిన వ్యక్తికి బీజేపీతో ఏమైనా సంబంధం ఉందా..? ఇలాంటివి ఏం చెప్పకుండా అరెస్ట్ చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.

Read Also: పేపర్లను లీక్ చేసే స్థాయికి బండి సంజయ్ దిగజారటం దౌర్భాగ్యం: పువ్వాడ

Follow us on:  Youtube,  Instagram,  Google News

Latest Articles

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం – ముగ్గురి దుర్మరణం

కర్ణాటకలో జరిగిన  హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెరువులో బురదలోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్