అలర్ట్: ఈసారి ఎండలు మండిపోనున్నాయి

ఈ వేసవి చాలా హాట్ గా ఉండనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలో ఎండలు మండిపోనున్నాయి. వాయువ్య ప్రాంతం మినహా మిగిలిన భారతదేశమంతా సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి వేడిగాలులు వీయవచ్చని పేర్కొన్నారు. అలాగే 1901తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య మరోసారి విద్యుత్ కొరత ఎదుర్కొనే భయం ఉందన్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

 

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్