రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు… అసలు రాహుల్ ఏమన్నాడు?

Rahul Gandhi | కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు దాఖలయింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( RSS​)పై రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ… ఉత్తరాఖండ్​లోని హరిద్వార్ కోర్టులో కమల్ భదౌరియా అనే వ్యక్తి పరువునష్టం దావా వేశారు. అయితే పరువునష్టం దావా వేసిన పిటిషనర్ ఆర్​ఎస్​ఎస్ కార్యకర్త కావడం గమనార్హం.

అసలు విషయానికొస్తే.. 2023 జనవరి 9న హరియాణాలో భారత్ జోడో యాత్రలో భాగంగా ఆర్ఎస్​ఎస్​పై రాహుల్​ గాంధీ పలు విమర్శలు చేశారు. అందులో ప్రధానమైనది ఏంటంటే.. 21వ శతాబ్దానికి చెందిన కౌరవులు ఖాకీ నిక్కరు ధరించి శాఖలు నడుపుతున్నారని ఆర్​ఎస్​ఎస్​ను ఉద్దేశించి మాట్లాడారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కమల్ భదౌరియా పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ పై భదౌరియా తరఫు న్యాయవాది వివరాలు తెలుపుతూ… ‘కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ఆర్‌ఎస్‌ఎస్‌ను 21వ శతాబ్దపు కౌరవులతో పోల్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చాలా అసభ్యకరంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాహుల్ ఆలోచనా ధోరణిని తెలియజేస్తోంది. దేశంలో ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చినా సాయం చేసేందుకు ముందుండే సంస్థ ఆర్​ఎస్​ఎస్​. ఈ కేసు ఏప్రిల్ 12న విచారణ జరగనుంది.’ అని వివరించాడు.

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్