రాహుల్‌పై అనర్హత వేటు.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: KCR

CM KCR: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు. సీఎం మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుని అన్నారు. ప్రధాని మోదీ దురహంకారం నియంతృత్వానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. పార్లమెంటును కూడా తమ హేయమైన చర్యలకు వాడడం గర్హనీయం అని అన్నారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని.. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతోందని మండిపడ్డారు.

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును మంత్రి కేటీఆర్ ఖండించారు. రాహుల్‌పై అనర్హత వేటు అత్యంత అప్రజాస్వామికమని.. అనర్హత వేటు వేయడం రాజ్యాంగాన్ని వక్రీకరించడమేనని అన్నారు. బీజేపీ దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని అన్నారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రజలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్