CM KCR: రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. సీఎం మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుని అన్నారు. ప్రధాని మోదీ దురహంకారం నియంతృత్వానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. పార్లమెంటును కూడా తమ హేయమైన చర్యలకు వాడడం గర్హనీయం అని అన్నారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని.. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతోందని మండిపడ్డారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటును మంత్రి కేటీఆర్ ఖండించారు. రాహుల్‌పై అనర్హత వేటు అత్యంత అప్రజాస్వామికమని.. అనర్హత వేటు వేయడం రాజ్యాంగాన్ని వక్రీకరించడమేనని అన్నారు. బీజేపీ దుశ్చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని అన్నారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రజలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.