రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. సినిమాలో ఓ మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించిన నేపథ్యంలో అనుమతులు, ఆమె భద్రత, సంక్షేమానికి సంబంధించిన వివరాలను సమర్పించాలని కోరింది.
బాలిక షూటింగ్లో పాల్గొనడానికి ముందు జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నారా? తల్లిదండ్రుల నుంచి అధికారిక సమ్మతి పత్రం పొందారా? అని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ప్రశ్నించారు. బాలిక కాల్షీట్లు, హాజరు రికార్డులు, షూటింగ్లో పాల్గొన్న పని గంటల వివరాలను అందించాలని ఆదేశించారు.
చదువుకు ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు, భద్రత కోసం ప్రత్యేక సంరక్షకుడిని నియమించారా అనే అంశాలపైనా వివరణ కోరారు. బాలిక పారితోషికంలో 20 శాతాన్ని ఫిక్స్డ్ డిపాజిట్‌గా జమ చేశారా? ప్రచార కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ వేడుకలో ఆమె పాల్గొనడంపై కూడా వివరాలు ఇవ్వాలని సూచించారు.
ఈ అంశాలకు సంబంధించిన పూర్తి ఆధారాలతో నవంబర్ 4న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నిర్మాతలను కార్మిక శాఖ అధికారులు ఆదేశించారు.


