పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఘర్షణలు

 

కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పలు వార్డుల్లో ఘర్షణలు చెలరేగడంతో ప్రాంతం రణరంగంగా మారింది. 8, 9, 10 వార్డుల్లో ఓటు వేసేందుకు వెళ్తున్న ఓటర్లపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఓటర్లు భయభ్రాంతులకు గురై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 11, 12 పోలింగ్ కేంద్రాల వద్ద ఇరువర్గాల మధ్య పరస్పరం రాళ్ల దాడి జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. 21వ వార్డు పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న ఓటర్లపై దాడి చేయడంతో పాటు, వారి ఓటరు స్లిప్పులను సైతం లాక్కుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
1, 2 వార్డుల్లో తమను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ మహిళా ఓటర్లు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘర్షణల సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్ ప్రేమలమ్మపై ప్రత్యర్థులు దాడి చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అల్లర్లలో పలు వాహనాల అద్దాలు ధ్వంసమవడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలాల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Latest Articles

తాగునీటిని పొదుపు చేయండి.. నిర్మాణాలు, పరిశ్రమలకు శుద్ధి చేసిన మురుగునీరే వాడండి: సీఎం రేవంత్‌ రెడ్డి

  హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు, వాణిజ్య సముదాయాలు తాగునీటికి బదులుగా శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి వనరుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్